Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao on Saturday reiterated that the government is committed to the welfare of the retired army personnel. The government has taken several measures for the welfare of the military personnel and some more are in the offing. He said the Telangana State would take better measures for the retired army personnel compared to other states.
The Chief Minister held a high-level review meeting on the welfare of the retired military personnel at Pragathi Bhavan here. Ministers Sri Naini Narasimha Reddy, State Government’s Principal Advisor Sri Rajeev Sharma, MPs Capt. Laxmikanth Rao, Vinod Kumar, Principal Secretaries Sri Rajiv Trivedi and Sri S. Narsing Rao, Home Secretary Ms Anitha Rajendra, Southern India Army Commandant General Maj Gen S. Pachauri, Secunderabad Station Brigadier Ajay Singh Negi, Col Tarun Kumar, Col Atul Rajput, Lt Gen Jaswinder Singh, Capt Navneeth Singh, Army Welfare Committee Members Sri Suresh Reddy, Sri Jagan Reddy, Sri Pochaiah, Sri Prabhakar Reddy, Sri Manohar Reddy and others participated in the meeting. Later, the CM had lunch with the participants and in the three-hour interaction that followed, he had taken several decisions.
The CM has already taken a decision to implement double pension scheme for the retired military personnel. The double pension benefit will also be given to the spouse in case of death of the army pensioner. This pension will also be paid along with pensions of other employees every month.
The CM has also decided to extend benefits given to the army personnel martyred while serving to those lost their lives due to ill health and accidents too. He has instructed the officials not to show any discrimination in this regard. Retired army personnel working as Special Police Officers will be paid salaries along with other employees every month.
The CM said there is a need to strengthen the Army Welfare Boards. There are 10 Sainik Welfare Boards in the districts, which will be extended to all the newly formed districts in the State. Steps will be taken to set up two Army Welfare Offices in Medak and Adilabad districts. The compensation money given for those getting the gallantry awards should be more in the Telangana State compared to other states. Reservation should be given to the children of serving and retired army personnel in the Government residential Schools. The State government should accord recognition to the schools run by the army. Students joining NCC, Scouts and Guides should be encouraged and those pursing courses in National Defence Academy from the State should be given fellowships.
Since the Centre has agreed to set up an Army School in Warangal, MoU in this regard should be signed as early as possible. Vehicles owned by the army personnel will be exempted from paying vehicle tax in the Telangana State.
Meanwhile, the retired army personnel representatives have thanked the CM for enhancing the pension of war widows, giving 2 percent reservation while allotting the two bed room houses, exempting the military personnel from paying property tax on their property.
మాజీ సైనికులు, వారి కుటుంబ సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా మెరుగ్గా ఇక్కడి మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దిశలో కొన్ని చర్యలు తీసుకున్నామని, మరికొన్ని చర్యలు కూడా త్వరలో తీసుకుంటామని చెప్పారు. మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి సంబంధించి శనివారం ప్రగతి భవన్ లో సిఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ఎంపిలు కెప్టెన్ లక్ష్మికాంత రావు, బి. వినోద్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రాజీవ్ త్రివేది, ఎస్. నర్సింగ్ రావు, హోం శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, దక్షిణ భారత సైనిక కమాండెంట్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ ఆర్.కె. ఆనంద్, తెలంగాణ ఏరియా కమాండెంట్ జనరల్, మేజర్ జనరల్ ఎస్. పచౌరి, సికింద్రాబాద్ స్టేషన్ బ్రిగేడియర్ అజయ్ సింగ్ నేగి, కల్నల్ తరుణ్ కుమార్, కల్నల్ అతుల్ రాజ్ పుట్, లెఫ్టినెంట్ కల్నల్ జస్విందర్ సింగ్, కెప్టెన్ నవనీత్ సింగ్, సైనిక సంక్షేమ కమిటీ సభ్యులు సురేష్ రెడ్డి, జగన్ రెడ్డి, పోచయ్య, ప్రభాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి భవన్లో మాజీ సైనికోద్యోగులు, సైనికాధికారులతో కలిసి భోజనం చేసిన సిఎం తర్వాత వారి సమస్యలు, ఇబ్బందులు సావధానంగా విన్నారు. దాదాపు మూడు గంటల పాటు వారితో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- మాజీ సైనికులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే వారికి డబుల్ పెన్షన్ ఇచ్చే విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. సదరు పెన్షన్ పొందుతున్న మాజీ సైనికోద్యోగి మరణిస్తే పెన్షన్ ను అతడి భార్యకు కూడా వర్తింపచేయాలని సిఎం ఆదేశించారు. ఈ పెన్షన్ కూడా ప్రతీ నెలా ఇతర ఉద్యోగులతో పాటు చెల్లించాలని చెప్పారు.
- యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు అందుతున్న సదుపాయాలు, పరిహారం సర్వీసులో ఉండి అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల లాంటి కారణాల వల్ల మరణించిన సైనిక కుటుంబాలకు కూడా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ విషయంలో వ్యత్యాసం చూపవద్దని కోరారు.
- స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న మాజీ సైనికోద్యోగుల వేతనం చెల్లించడంతో పాటు, ఆ వేతనాలను కూడా ప్రతీ నెలా ఇతర ఉద్యోగులతో పాటు విధిగా చెల్లించాలని సిఎం చెప్పారు.
- రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేయాలి. ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న బోర్డులను రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో సైనిక సంక్షేమ కార్యాలయ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి.
- యుద్ధంలో మరణించిన సైనికులకిచ్చే గ్యాలంటరీ అవార్డుల ద్వారా ఇచ్చే పరిహారాన్ని మిగతా రాష్ట్రాలన్నింటికంటే తెలంగాణలో ఎక్కువ ఉండేలా విధానం రూపొందించాలి.
- సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి రిజర్వేషన్ కల్పించాలి. మిలటరీ నిర్వహించే స్కూళ్లకు రాష్ట్ర గుర్తింపునివ్వాలి. విద్యా సంస్థల్లో స్కౌట్స్, గైడ్స్, ఎన్.సి.సి. శిక్షణ తీసుకునే విధంగా విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాలి. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన విద్యార్థులకు ప్రోత్సహకాలు అందించాలి.
- వరంగల్లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినందున దీనికి సంబంధించి వెంటనే ఎంవోయు చేసుకోవాలి.
- ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైనికులు తిరుగుతుంటారు. రాష్ట్రం మారిన ప్రతీ సారి వారి సొంత వాహనాలకు తిరిగి లైఫ్ ట్యాక్సులు చెల్లించాల్సి వస్తున్నది. దేశంలో ఇప్పటికే ఎక్కడ పన్ను చెల్లించినప్పటికీ తిరిగి తెలంగాణ రాష్ట్రంలో చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలి.
- సైనికులు నిర్మించుకునే ఇండ్లకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ పథకంలో మాజీ సైనికులకు రెండు శాతం కేటాయించాలని, డబుల్ పెన్షన్ విధానం అమలు చేయాలని, వీర సైనికుల భార్యలకిచ్చే పెన్షన్ ను రూ. 6వేలకు పెంచినందుకు ముఖ్యమంత్రికి మాజీ సైనికోద్యోగులు అభినందనలు తెలిపారు.