సైనిక సంక్షేమ కార్యాలయం తెలంగాణా ప్రభుత్వం : మాజీ సైనికుల వివరాల నమోదు మరియు ఆధునీకరణ
మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల
సంక్షేమము కొరకు సైనిక సంక్షేమ
కార్యాలయం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబడినది. సైనికోద్యోగులు
ఆర్మీ, నేవీ, మరియు ఎయిర్
ఫోర్సు నుండి రిటైర్ అయిన వెంటనే
సంబందిత పత్రాల తో సైనిక సంక్షేమ శాఖ ను సంప్రదించిన తరువాత మాజీ సైనికుల పేర్లు నమోదు చేసుకుని ఐడెంటిటీ కార్డు ఇస్తారు.
ఈ మధ్య కాలము లో గుర్తించినది ఏమనగా కొంత మంది మాజీ సైనికులు ఇంత వరకు తమ పేర్లను తమ జిల్లా సైనిక సంక్షేమ
కార్యాలయము లో నమోదు చేసుకోలేదు. అందువల్ల కేంద్ర
మరియు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చే
ప్రయోజనాలు మరియు రాయితీలు మాజీ సైనికులకు చేరటము లేదని
గమనించటమైనది. ఆర్హత కలిగిన మాజీ సైనికులు ప్రయోజనాలు పొందాలి అనేది మా ముఖ్య సంకల్పము. అందుకు
ప్రతీ మాజీ సైనికుడు జిల్లా
సైనిక సంక్షేమ కార్యాలయము లో పేర్లు నమోదు చేసుకుని ఆధునీకరణ
(అప్డేట్) చేసుకోవాలి.
చాలా
మంది మాజీ సైనికులు చిన్న వయసులో త్రివిధ దళాల నుండి పదవీ విరమణ
చేసి బయటకువస్తారు. సర్వీసులో ఉండగా లేక
పదవీ విరమణ తరువాత వివాహం చేసుకుంటారు.
కానీ వారి కుటుంబ సభ్యుల వివరాలు
ఆ సంబందిత రికార్డ్స్ లో నమోదు చేయించుకోవటము లేదు. దీని వలన, దురదృష్టవశాత్తు
మాజీ సైనికుడు
మరణించిన యడల మాజీ సైనికుని వితంతువు కు పెన్షన్ మంజూరీ కి చాల జాప్యం జరుగుతుంది.
కొంతమంది మాజీ సైనికులు సర్వీసు
కాలం లో లేక పదవీ విరమణ చేసిన తరువాత పుట్టిన పిల్లల పేర్లను నమోదు చేయకపోవటం
వలన వారికి రావలిసిన విద్యా రిజర్వేషన్ మరియు
స్కాలర్షిప్ లను కోల్పోతున్నారు. మరి కొంతమందికి నమోదు చేసుకున్నపేరు ఆధార్ కార్డు లేక పాన్ కార్డు లో బ్యాంకు ఎకౌంటు
లో ఊన్న పేరు తో వ్యత్యాసం ఉండటము వలన ఆర్ధిక ప్రయోజనాలు అందించటములో జాప్యం జరుగుతున్నది.
అన్నింటి కంటే
ముఖ్యముగా గమనించిన విషయం ఏమిటంటే మాజీ సైనికులు పదవీ విరమణ ముందు బ్యాంకు లో ఒక సింగిల్ ఎకౌంటు
మరియు ఒక జాయింట్ అకౌంట్తెరుస్తారు. కాని వారి పెన్షన్ సింగల్ ఎకౌంటు లో
వచ్చుచున్నది. దీని వలన మాజీ సైనికుల మరణానంతరం ఆ బ్యాంకు ఎకౌంటు లో వితంతువు కు పెన్షన్ లభించటం కొరకు మరల మిలిటరీ రికార్డ్స్ ఆఫీస్ లకు రాసి వారి పెన్షన్ తెప్పెంచుటకు కనీసం 6 నెలల నుంచి సంవత్సరం వరకు సమయము పడుతుంది. కావున మాజీ సైనికులు అందరు వారు
పెన్షన్ పొందుతున్నటువంటి బ్యాంకు ఎకౌంటు ను తమ
భార్య పేరు తో జాయింట్ ఎకౌంటు గా మార్పించు కోవాలి అని
కోరుచున్నాము. తమరి భార్య పెన్షన్ పేమెంట్
ఆర్డర్ లో ఊన్న పేరు తో మాత్రమే
బ్యాంకు ఎకౌంటు లో జాయింట్ గా నమోదు
చేసుకోగలరు.
ఫైన తెలియ చేసిన కారణాల దృష్ట్యా సైనిక సంక్షేమ శాఖ
తెలంగాణా ప్రభుత్వం వారు ప్రతి జిల్లా
లో అవగాహనా సదస్సులుకూడా ఏర్పాటు
చేసి మాజీ సైనికులకు ఐడెంటిటీ కార్డు
మరియు వివిధ రకముల ప్రయోజనాలు
తెలియజేయచున్నారు. అంతే కాకుండా పెన్షన్ సంబందిత సమస్యలు తీర్చుటకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ మరియు ఇతర బ్యాంకు లతో
కలిసి పెన్షన్ అదాలత్ ఏర్పాటు చేసి పెన్షన్ ప్రాబ్లెమ్స్ ని తీరుస్తున్నారు.
ఎవరైనా మాజీ సైనికులు లేక వారి వితంతువు లు గతం లో
రిజిస్ట్రేషన్ చేయించుకుని
ఐడెంటిటీ కార్డు పోంది వున్నారో వారు కూడా
వారివారి జిల్లా సైనిక సంక్షేమ
అధికారి ని కలిసి క్రింది తెలిపిన పత్రాల ను అందచేసి తమ దస్తావేజులను ఆధునీకరణ
చేసుకోగలరు అని కోరుచున్నాము. ఈ దస్తావేజులు పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చును.
ఎ) డిశ్చార్జ్
సర్టిఫికేట్/ సర్వీస్ సర్టిఫికేట్
బి) పెన్షన్
పేమెంట్ ఆర్డర్
సి) ఆదార్ కార్డు
డి) కాన్సిల్ద్ చెక్ లేక బ్యాంకు పాస్ పుస్తకం ఫస్ట్ పేజి
ఇ) పాస్ పోర్ట్
సైజు ఫోటోగ్రాఫ్స్ (04)
మాజీ సైనికులు ఒక
ఈమెయిలు ఎకౌంటు ఓపెన్ చేసి
తమ ఈమెయిలు ఎకౌంటు పేరు అండ్
మొబైల్ నెంబర్ వారి జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం కు అందించ గలరు. దీని ద్వార వారికి అందే రా యితీల గురించి
వారికి ఎప్పుడుదప్పుడు ఈ మెయిలు లేక ఎస్ ఎం ఎస్
ద్వారా తెలియజేయబడును.
మాజీ సైనికులందరూ 31 మార్చ్ 2017 వరకు తమ దస్తా వేజులు పంపి ఆధునీకరణ చేయించు కోగలరు
అని విజ్ఞప్తి చేస్తున్నాము.
కర్నల్ పి. రమేష్ కుమార్
సంచాలకులు
సైనిక సంక్షేమ
కార్యాలయం తెలంగాణ
============================================
REGISTRATION WITH SAINIK WELFARE DEPARTMENT AND GET THEIR DOCUMENTS UPDATED AND COMPUTERISATED
The Sainik
Welfare Department, Telangana looks
after the welfare of Ex-Servicemen and their dependents. The Ex-Servicemen, i.e the retired personnel
from Army, Navy and Air Force are provided with an Identity card by Sainik
Welfare Department immediately after retirement on production of their retirement
documents.
It
has come to the notice of Sainik Welfare Department, Govt of Telangana
that some Ex-Servicemen are still not registered or are not updated their
documents with the Sainik Welfare Department due to which the benefits due from
State and Central Government are not reaching them.
Most
of the Ex-Servicemen retire young and the names of their wife and children are
not updated in the documents at the time of retirement due to which their
widows have to do extensive documentation after the death of Ex-Servicemen to
get family pension. Similarly, the names
of children are also not updated due to which it becomes difficult to provide
reservation in education and scholarships.
It is also seen that there are discrepancies such as spelling mistakes
in the names of the wife and children due to which they are facing severe
hardship at the time of sanctioning family pension and other benefits.
Similarly their names are not matching with Aadhar card or PAN card due to
which their pension claims are getting delayed.
The
Ex-Servicemen open one Single account and one Joint Account in Bank at the time
of retirement. A large number of cases
have come to notice where the Pension accounts of Ex-Servicemen are single
accounts and the same account number is mentioned in Pension Payment
Order. The Joint account becomes
inoperative after six months or so due to which the widows do not get their
pension immediately after the death of the Ex-Servicemen.
The ageing and ailing
widows have to do extensive documentation after the death of the Ex-Servicemen
and their pension gets delayed for a number months and at times even years. The
Office of Director Sainik Welfare and Zilla Sainik Welfare Offices have
resolved a number of such cases in the last 2 years. The Director Sainik Welfare has also taken up
the issue with Army HQs and they have issued orders to all Army units.
All
ex-servicemen are requested to get their Single Pension accounts converted into
Joint accounts as per the name of the wife in Pension Payment Order.
Sainik
Welfare Department has been conducting a number of Camps all over the State
educating the Ex-Servicemen and their dependents on the above aspects. Sainik Welfare Department has also conducted
Pension Adalat to resolve the pension related grievances with banks such as
State bank of India and State Bank of Hyderabad. Action in hand to conduct
similar Pension Adalat with other hands.
All
the Ex-Servicemen and widows of
Ex-servicemen who have not registered themselves with Sainik Welfare Department
are requested to visit the office of their Regional/Zilla Sainik Welfare
offices and get themselves registered by providing one copy each of the
following documents alongwith original for verification:
a) Discharge Book /Service Particulars.
b) Pension Payment Order (Only for Pensioners).
c) Aadhar card
d) Cancelled Cheque or First page of the Bank pass book.
e) Passport size Photograph(04)
Those
Ex-Servicemen or widow who have registered earlier but not provided these documents are
also requested to provide these documents so that their records are updated. They can also send the documents by post to
their Zilla Sainik Welfare Office or to the Director, sainik Welfare, Sainik
Aramghar Complex, Near Yashoda Hospital, Somajiguda, Hyderabad.
All
Ex-servicemen are also requested to open an email account and submit their
email ID and Mobile number to the Zilla
Sainik Welfare Department so that all important information may be sent to these though mail and SMS.
Director
Sainik Welfare, Hyderabad has now computerised the records of Ex-Servicemen so
that benefits can be provided efficiently& by faster means.
The ESM can now register online by
visiting www.telanganasainik.org They can also apply for grants applicable to them online.
I
request the Cooperation of all Ex-Servicemen and their dependents in updating
their records so that the benefits applicable to them may be provided to them
faster and in an efficient manner.
They
can visit the Office of Regional/Zilla Sainik Welfare Officer on any working
between 10.30 AM and 5 P.M. and submit their documents for updation or
registration. All old case will be
entertained till 31 March 2017.
May
I request your kind cooperation to kindly publish suitable article an all
editions of news papers in the State so that maximum number of Ex-Servicemen
and their dependents are benefited.
DIRECTOR
SAINIK WELFARE
(Source- Via Gp e-mail)
Thank you very much and very good message to all veterans
ReplyDelete