Sunday, May 8, 2016

ఇంకుడు గుంతలు : వాన నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలే ఏకైక మార్గం !!

తెలంగాణలో భూగర్భ జలాలు ఆందోళకరమైన స్థాయికి పడిపోయాయి. నగరం, ఊరు అనే తేడా లేకుండా తాగు నీటికి, గ్రామాల్లో సాగునీటికి కటకట ఏర్పడింది. ఈ వర్షాకాలంలో వాన నీటి సంరక్షణ ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేసేందుకు ఈ ప్రయత్నం.
హైదరాబాదులో దాదాపు 1500 అడుగుల బోర్లు వేసినా చుక్క నీరు దొరకని పరిస్థితి వచ్చింది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ప్రతి వర్షాకాలం ప్రకృతి మనకు సరిపోయే నీటిని ఇస్తున్నా, మనం ఆ నీటిని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేయడం లేదు.
భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చేముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలనీ, అవి ఉంటేనే నిర్మాణానికి అనుమతి పత్రాలు జారీచెయ్యాలని హైదరాబాద్ మహానగర పలక సంస్థ ,హైదరాబాద్ మెట్రో అభివృద్ధి సంస్థలను బుధవారం ఉమ్మడి హైకోర్ట్ ఆదేశించింది.
వృధా గా పొయ్యే నీరుతో ఇంకుడు గుంతలు తవ్వి భూమి తల్లి దాహం తీరిస్తే ఆ తల్లి మనకు నిత్యం నీటిని ఇస్తుందని నమ్మినవాడిని చూసి నవ్వాం, ఈ రోజు కలుషిత నీళ్ళు కూడా కనిపించకుండా పోతుంటే కలవరపడుతున్నాం.
మన ఇంటి ఆవరణలో ఉన్న బోరు బావికి సంవత్సరం అంతా నీరు పుష్కలంగా అందడానికి వాన నీటి ఇంకుడు గుంతలే ఏకైక మార్గం. ఇంకుడు గుంతలు తవ్వే విధానం:- 250 గజాల నుండి 500 గజాల స్థలములో ఉన్న ఇంటి ఆవరణలో 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు, 8 అడుగుల లోతు ఉండేటట్లుగా గుంట తీయాలి. గుంట లోపల నలుగు వైపులా అడుగు భాగములో ఎక్కడా సిమెంట్ ప్లస్తింగ్ చేయకూడదు. మట్టి గుంటలో సగ భాగం అంటే 4 అడుగుల మేర 60mm లేదా 40mm గ్రానైట్ రాళ్ళు వేయాలి. వాటిపైన 2 అడుగుల మేర 20mm కంకర చిప్స్ వేయాలి. దానిపై 3 అంగుళాలు మాత్రమే బటాణ (గులక రాళ్ళు) లేదా దొడ్డు ఇసుక వేయాలి ఇలా చేయగా మిగిలిన 1. అంగుళాల గుంట లోపలి భాగమున మాత్రమే సిమెంట్ ప్లాస్తింగ్ చేసుకోవాలి. ఆ తరువాత 1. అంగుళాల ప్రదేశాన్ని ఖాళీగానే ఉంచాలి. గుంట చుట్టూ 9 అంగుళాల గోడ భూమి పైనుండి 6 అంగుళాలు లేదా 1 అడుగు పైకి కట్టుకోవాలి. ఆ తరువహ్త ఇంటి పై భాగం మీద పడే వాన నీరు ఇంకుడు గుంత లోనికి వచ్చే విధముగా 6 అంగుళాలు పైపును ఇంటి పై భాగం నుండి ఇంకుడు గుంట లోనికి ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధముగా నిర్మించిన ఇంకుడు గుంత ఎంత పెద్ద వాన కురిసిన ఆ నీటిని పీల్చుకోగలుగుతుంది.
గమనిక :-
* ప్రతి సంవత్సరం మే నెల 4వ వారం నుంచి ఇంటి పై భాగములో ఏ విధమైన చెత్త లేకుండా శుభ్రంగా వుంచుకోవాలి.
* ఇంకుడు గుంట లోపల ఎప్పుడూ చెత్త, కాగితాలు, ఆకులు, ప్లాస్టిక్ కవర్లు లేకుండా చూడాలి .
* ఇంకుడు గుంటలో పైన వున్న 3 అంగుళాల గులక రాళ్ళు లేదా ఇసుకను ప్రతి సంవత్సరం తీసి నీటిలో కడిగి మరల వాడితే ఎంత వర్షపు నీటిని అయినా ఇంకుడు గుంత నిమిషాలలో పీల్చుకోగలుగుతుంది. తద్వారా భూగర్భ జలాలు మనకు అందుబాటులో వుంటాయి. నీటి మట్టం బాగా పెరుగుతుంది.
వాస్తవాలు:-

* నగరములో కురిసే వర్షపు నీరు 92% వృధాగా పోతుంది.
* ఒక్క కుటుంబానికి 3 సంవత్సరాల అవసరానికి కావలసిన నీటిని ఒక్క వర్శాకాలములోనే సేకరించవచ్చు.
* ఇంటి నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగదు.
(Source- Face boob post - S Radhakrishna)

No comments:

Post a Comment